badam pappu uses: అత్యధికంగా పోషకాలు అందించే పప్పుల్లో బాదం ఒకటి అని చెప్పవచ్చు. మార్కెట్లో దీని ధర ఎంత ఉన్నదనేది ప్రక్కన పెడితే, మనకు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తున్నదనే తెలుసుకోవాలి. ప్రతిరోజూ కొంత మోతాదులో దీనిని తీసుకుంటే ఊహించని ఆరోగ్య మార్పులను గమనించవచ్చు. ధర కాస్త ఎక్కువుగా ఉండటం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తినడానికి ఆలోచిస్తారు. ప్రస్తుతం బాదంపప్పు పౌడర్, జ్యూస్ రూపంలో కూడా లభ్యమవుతుంది. అసలు బాదం పప్పు తింటే లభించే ప్రయోజనాలు తెలుసుకుందాం!.
బాదంతో ఎన్నో బెనిఫిట్స్
కంటిచూపు మెరుగుపడాలంటే బాదం పప్పులను తీసుకోవాలని న్యూట్రీషన్లు సలహా ఇస్తుంటారు. దీనిలో ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి 5 నుంచి 10 బాదం పప్పులను నీటిలో నానబెట్టాలి. ఉదయం పేస్ట్ చేసి గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి తీసుకోవాలి. దీని వల్ల కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు.
బాదం పప్పు పావు కేజీ ఒక రాత్రంతా వేడి నీటిలో నానబెట్టి ఉదయం పై తోలు తీసి నలగ్గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేయాలి. తర్వాత సోంపు పావు కేజీ తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. పావు కేజీ బెల్లంతో పై రెండు పొడులతో కలిపి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని రోజూ ఒక చెంచా పాలలో కలుపుకొని తాగితే కృశించిన నాళములు తిరిగి శక్తివంతమవుతాయి. ఇలా వరుసగా ఆరు నెలలు వాడినా కంటి చూపు మెరుగు అవుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చర్మ వ్యాధులకు బాదం పప్పు మంచి నీటిలో నానబెట్టి మెత్తగా నూరి లేపనం చేసినా పొడలు, దురదలు, మచ్చలు తగ్గిపోతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటి వారు ఈ బాదం తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. హృద్రోగాలూ బాధించవు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలాంటే కనీసం ఆరు వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్, పొట్ట చుట్టుకొలత తగ్గుతుంది. రక్తప్రసరణ సాధారణ స్థితిలోకి వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి, విటమిన్లు, మినరల్స్ ఇందులో దొరుకుతాయి. కొవ్వు శాతం లేకుండా చూసుకోవచ్చు.
badam pappu uses: తలనొప్పికి ఉపశమనం బాదం పప్పు
తలనొప్పితో బాధపడే వాళ్లు బాదం గింజల్ని తినాలంటున్నారు పరిశోధకులు. బాదం గింజల్లో నొప్పిని తగ్గించే పదార్థం యాస్ర్పిన్, మెగ్నీషియం, విటమిన్-ఇ, సాల్సిన్లలో ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువుగా ఉండటం వల్ల ఇవి తింటే మైగ్రెయిన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. భవిష్యత్తులో తలనొప్పి రాకుండా నివారించవచ్చు.

గుండె జబ్బులను నివారించాలంటే గుప్పెడు బాదం పప్పుల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బాదం పప్పు(badam pappu)లోని పీచు పదార్థం ఉండటం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరిగి రక్త పోటు గణనీయంగా తగ్గుతుంది.
బాదం నూనెతో రోజూ ఉదయం 10 నిమిషాలు మర్దన చేసుకుంటే ముఖంపై నలుపు, ఎరుపు మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. కళ్లకింద ఉబ్బు తగ్గాలంటే బాదం నూనెను వేళ్లతో తీసుకొని సున్నితంగా మసాజ్ చేసుకుంటే ఉబ్బుతో పాటు నల్లని వలయాలు తగ్గుతాయి. నానబెట్టిన బాదం పప్పులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పచ్చి పాలను కలిపి ముఖానికి ప్యాక్ చేసి, 15 నిమిషాల తర్వాత కడుక్కుంటే పొడి చర్మం ఉన్న వారి ముఖం నిగనిగలాడుతుంది. చర్మం కాంతివంతంగా ఉంచుతుంది.