Neerulli: నీరుల్లి, వెల్లుల్లి ఒకే జాతికి చెందినా, గుణాలలో కొంచెం తేడా ఉంది. నీరుల్లి కలయిక లేని కూరలంటూ ఉండవు. కొద్దిమందికి మాత్రమే నీరుల్లి అంటే గిట్టదు. నీరుల్లికి గల ఒక రకమైన వెగటువాసనే దానికి కారణం. ఈ నీరుల్లి దుంపల్లో ఎరుపు, తెలుపు రంగు భేదాలున్నా గుణాలు మాత్రము ఒక్కటే.
సర్వాంగాలు ఒకరకమైన ఘాటైన వాసన కల్గి ఉంటాయి. రుచికి కొద్ది కారంగాను, తీపిగాను ఉంటాయి. కుమ్ములో గాని, నీటిలోగాని బాగా ఉడికిస్తే తీపి రుచిగా తినడానికి వీలుగా మారతాయి.
నీరుల్లితో ఇంట్లోనే ఆరోగ్యం
నీరుల్లి గడ్డలు ఉడికిన తర్వాత తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎక్కువశాతం నీరు ఉండబట్టి నీరుల్లి అంటారు. కాని దీనిలో వట్టి నీరే ఉంటుంది. ఉపయోగం ఏమీ లేదనుకోవడం వట్టి భ్రమ మాత్రమే అవుతుంది. నీరుల్లి మంచి బలకరమైన పదార్థం, పుష్టినిస్తుంది.భ్రమలు తొలగించి బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. ఆకలిని పుట్టిస్తుంది. నీరుల్లికి వాతాన్ని హరించి కఫాన్ని పెంచే గుణం ఉంది. దీనివల్ల రక్త పైత్యం తగ్గుతుంది. వాంతులు కడతాయి. మూలవ్యాధులు తగ్గిపోతాయి.
వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.నీరుల్లి రసాన్ని ముక్కులో పిండితే మూర్ఛల నుండి తేరుకుంటారు. ముక్కు నుండి రక్తం కారే జబ్బు తగ్గుతుంది. నీరుల్లి పచ్చికాని, ఉడికించిగాని తింటే మూలవ్యాధి వల్ల కలిగే అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. నీళ్ళ విరేచనాలు కడుతుంది. నీరుల్లి రసాన్ని నశ్యం చేయిస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఎగశ్వాస తగ్గుతుంది.
ఉల్లిపాయలను ముక్కలుగా తరిగిగాని, గడ్డల రూపంగా గాని నేతిలో వేయించి, పంచదార లేతపాకం పట్టి దానిలో కలిపి మొత్తానికి సగం తేనె కల్పి నిల్వ ఉంచి రోజు ఉదయం, సాయంత్రం తింటే మేహ ఉడుకులు తగ్గిపోతాయి. శుక్రనష్టాలు తగ్గి వీర్యపుష్టి చేస్తుంది. మతిభ్రమలు, మూర్ఛలు శమిస్తాయి. తేలుకుట్టిన చోట నీరుల్లి రసాన్ని రుద్ది తెల్లగుడ్డ వత్తిగా చేసి నిప్పు అంటించి చేస్తే తేలు విషం హరించిపోతుంది. నీరుల్లి రసాన్ని యూకలిప్టస్ ఆయిల్‌తో కలిపి తేలు కుట్టిన చోట రాస్తే విషం హరిస్తుంది.
Neerulli ఇలా తింటే జబ్బులు దరిచేరవు!
నీరుల్లిపాయలు, కొండపిండిచెట్టు వేళ్ళు (పాషాణభేది చెట్టు) కషాయం పెట్టి తాగితే మూత్రంలో రాళ్ళు కరిగిపోతాయి. మూత్రంలో మంటలు తగ్గుతాయి. నీరుల్లి రసంలో యాలకుల గింజల చూర్ణం కలిపి తాగితే మూత్రంలో పోయే తెల్లని పదార్థం (అల్బుమిన్) తగ్గుతుంది. నీరుల్లిరసం తీసి ఒకటి లేక రెండు చుక్కలు కంటిలో వేసిన రేచీకటి తగ్గిపోతుంది. గోంగూర, పులుసు, అన్నం పథ్యమివ్వాలి.
నీరుల్లిపాయలో రంధ్రం చేసి దానిలో కొద్దిగా పటిక, వెలిగారం పెట్టి రంధ్రం మూసి కుమ్ములో ఉడికించి తీసి మొత్తం కల్వంలో వేసి నూరి దానితో పళ్ళు తోముకుంటే అన్ని రకాల దంతరోగాలు తగ్గుతాయి. నీరుల్లి గడ్డలను పన్నగాగాని, సగానికి గాని కోసి మాడుపై వేసి గుడ్డకట్టి ఎంత ఎండలో ప్రయాణించినా వడదెబ్బ తగలదు.
ఉడికించిన నీరుల్లి గడ్డలను మెత్తగా నూరి శరీరంపై కల్గిన గడ్డలకు వేడినేతిని రాసి దానిపై నీరుల్లి నూరిన ముద్ద వేసి కట్టుకడితే కరిగిపోతాయి. నీరుల్లి ( మితంగా వాడితే కఫాన్ని సైతం తగ్గిస్తుంది. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్టు చేస్తుంది. నాడీ వేగాన్ని పెంచుతుంది.

నీరుల్లి వాడకం ఎక్కువైతే పై రోగాల్ని తగ్గించడం పోయి ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. అజీర్తి పుట్టిస్తుంది. బాగా ముదిరిన నీరుల్లి గడ్డరసం (neerulli uses) తేనెతో చేర్చి తీసుకుంటే తరుణావస్తలో ఉన్న శ్వాసకాసలు తగ్గుతాయి. ఎప్పటినుండో బాధిస్తున్న దగ్గులు తగ్గుతాయి. విష జ్వరాలు సైతం దీనికి తొలగిపోతాయి.
నీరుల్లి, మిరియాలు సమంగా కలిపి నువ్వులనూనెలో గాని, నేతితోగాని కలిపి మిరియాలు మాడిపోయేంత వరకు నీరుల్లిరసం ఇగిరిపోయి తైలం మాత్రమే మిగిలే వరకు వండి, దించి కొద్దిగా ముద్ద హారతి కర్పూరం నూరి కలిపి వాతనొప్పులకు, చర్మరోగాలకు మర్దనాగాను, పై పూతగాను వాడిన వాతనొప్పులు, చర్మ రోగాలు తగ్గిపోతాయి.
ముదిరిన నీరుల్లి గడ్డలో కొద్దిగా నల్లమందు పెట్టి ఉడికించి తింటే గ్రహిణులు, నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి. ఉడికించిన నీరుల్లి గడ్డ, నల్లమందు, ఆముదం గింజల పప్పు మెత్తగా నూరి శరీరంపై కలిగే గడ్డలకు రాసిన కొద్దిసేపట్లోనే గడ్డలు పగిలి బాధలు తగ్గిపోతాయి.