Menthi Kura: మెంతి కూర ఆరోగ్య ప్రయోజనాలు

Menthi Kura: విటమిన్లు అధికంగా ఉండే ఆకుకూరల్లో మెంతికూర చాలా ముఖ్యమైనది. ఇది రుచికి కొద్దిగా చేదుగా ఉండి, ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటుంది. మెంతికూరలో ఐరన్, కాల్షియం అధిక మోతాదులో ఉండగా, ఇతర అవసరమైన విటమిన్లు కూడా గణనీయంగా ఉంటాయి. మన ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కనీసం 35 గ్రాముల ఆకుకూరలు చేరిస్తే పరిపూర్ణమైన పోషకాహారం లభిస్తుందని ఒక సర్వేలో వెల్లడైంది. ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది.

సంవత్సరం పొడవునా మెంతి లభ్యం

సంవత్సరం పొడవునా మెంతికూర మనకు లభ్యంకాకపోయినా, అది లభ్యమయ్యే కాలంలో ఎండబెట్టినిల్వచేసుకోవచ్చు. ఎండబెట్టిన Menthi Kuraను కూడా పచ్చికూరవలె రకరకాల వంటలలోఉపయోగించుకోవచ్చు.తాజా మెంతికూరలో ‘ట్రేగ్ ధీస్’ అనే పదార్థం ఉంటుంది.దీని ప్రభావం వల్ల మెంతికూరతో చేసిన వంటకాలుకాలేయం, ఊపిరితిత్తులు, హృదయము, మెదడుకుసంబంధించిన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

అరకప్పు మెంతికూర రసంలో తేనె కలిపి రోజుకొకసారిసేవిస్తే లివరు పెరుగుట, కామెర్లు, పైత్యం వల్ల వచ్చేతలనొప్పి, కాలేయానికి వచ్చే కురుపు, ఉబ్బసం, క్షయ,నిద్రపట్టకపోవడం, తలతిరుగుడు నివారించవచ్చు.మెంతికూర రసం ఒక టేబుల్ స్పూన్ క్రమంతప్పకుండా మూడు నెలలపాటు తీసుకుంటే ప్రాధమికదశలో ఉన్న మధుమేహం నయమవుతుంది.

Menthi Kura: టానిక్గా పనిచేస్తుంది

మెంతిగింజలను రెండు టీస్పూన్లు తీసుకునిమంచినీటిలో 4 గంటలు నానబెట్టి ఇగిరిపోయేటట్లుమరగనివ్వాలి. ఈ కషాయాన్ని వడగట్టి దానిలో ఒకటేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీనిని ప్రతి రాత్రి కొద్దిగాటానిక్ లా తీసుకుంటే ఊపిరితిత్తులు, కాలేయానికిసంబంధించిన వ్యాధులు నయమవుతాయి.మధ్యపానం వలన చెడిపోయిన కాలేయంబాగుపడుతుంది. కామెర్లు, నీరసం, రక్తహీనత మొదలైన వాటి నుండి రక్షించుకోవచ్చు.

మెంతులను కొద్దిగా వేడిచేసి, పొడిగా దంచి వెన్నతో కలిపి తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి. అలాగే మూలవ్యాధి సమస్యకు ఉపశమనం లభిస్తుంది. కడుపునొప్పి ఉన్నవారికి కూడా ఇది మంచి సహజ మందులా పనిచేస్తుంది.బాలింతలకు పాలు తక్కువగా వస్తున్నప్పుడు, పాలలో మెంతులు వేసి బాగా ఉడికించి తీసుకుంటే పాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంటుంది. ఇది చాలా కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో పాటిస్తున్న పద్ధతి.

కంటి సమస్యల విషయంలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతిఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి జాగ్రత్తగా కంట్లో వేసుకుంటే కండ్ల మంట తగ్గుతుంది. కంటి కలక తగ్గడమే కాకుండా, కళ్ళు పుసికట్టకుండా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

menthi kura benefits, Telugu health tips

వెంట్రుకలపై మెంతుల పాత్ర

  • మెంతికూరను బాగా రుబ్బి ఆ ముద్దను స్నానానికిముందు తలకు మర్దన చేసుకుంటే చుండ్రు, పేలు పోయిజుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది.
  • కొబ్బరినూనెలో మెంతులు వేసి తలకు రాసుకుంటేవెంట్రుకలు నల్లబడి జుట్టు రాలిపోకుండా ఉంటుంది.
  • మెంతిగింజల ముద్దను కాగిన పాలలో కలిపిపూసుకుంటే శరీరం రాగరంజితమైఇనుమడిస్తుంది.
  • మెంతిఆకును మెత్తగా నూరి కొద్దిగా నూనె చేర్చిఉడికించి గడ్డలపై పట్టీ వేసిన గడ్డలు పక్వమై పగులును.
  • మెంతి ఆకులను ఉడికించి నేతిలో వేయించిఅందులో కొద్దిగా మిరియాలు, ఉప్పు చేర్చి ఇచ్చినకీళ్ళనొప్పి, నడుము నొప్పి తగ్గును.
  • గోధుమరవ్వ యందుమెంతికూర, మిరియాలు, పాలు, నెయ్యి, చక్కెర చేర్చిపాయసము వలె చేసి ఇచ్చిన శరీరమునకు పుష్టిని, శక్తినికలుగచేయును.
  • మెంతికూరను నూరి ముద్ద చేసి తేనెచేర్చి ఇచ్చిన సుఖ విరేచనము అగును. మూలశంకనుతగ్గించును. దగ్గు తగ్గును. ప్రేగులలో పుండ్లనుమాన్పును.
  • ఒక టీ స్పూన్ మెంతులు(fenugreek) పొడిచేసి ఒక గ్లాసుమజ్జిగతో రోజుకు 3 లేదా 4 సార్లు సేవించిన జిగటవిరేచనములు, వేడి, దప్పిక తగ్గును.

Leave a Comment