Dental Implant: డెంటల్ ఇంప్లాంట్ కు డౌట్ ఎందుకు?

దంత‌క్ష‌యం, చిగుళ్ల వ్యాధి, దెబ్బ‌లు త‌గ‌ల‌టం. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చాలా మందికి ప‌ళ్లు ఊడిపోతుంటాయి. ఇలాంటి వారికి గ‌తంలో బ్రిడ్జెస్‌, క‌ట్టుడుప‌ళ్ళు వంటివి అమ‌రు స్తుండేవారు. కానీ ఇప్పుడు అధునాత‌న డెంట‌ల్ ఇంప్లాంట్స్ Dental Implant, ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

ఇవి క‌ట్టుడుప‌ళ్ల‌లా పైపైన అమ‌ర్చేవి కావు. ద‌వ‌డ ఎముక లోప‌ల దంత‌మూలం స్థానంలో టైటానియం ఇంప్లాంటును అమ‌ర్చుతారు. చుట్టూ ఎముక పెరిగి స్థిర ప‌డిన త‌ర్వాత ఇంప్లాంటుపై కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది అచ్చం స‌హ‌జ‌మైన దంతం మాదిరిగా క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు. బ‌లంగానూ ఉంటుంది.

డెంట‌ల్ ఇంప్లాంట్స్‌ను ద‌వ‌డ ఎముక‌లో కుదురుకునేలా అమ‌రుస్తారు కాబ‌ట్టి ఇవి దాదాపు శాశ్వ‌తంగా ఉంటాయి. మాట్లాడుతున్న‌ప్పుడు క‌ట్టుడు ప‌ళ్ళు teeth, కొన్నిసార్లు నోట్లోకి జారి పోవ‌చ్చు. దీంతో మాట ముద్ద‌ముద్ద‌గా, త‌త్త‌ర‌పోయే ప్ర‌మాద‌ముంది. కానీ ఇంప్లాంట్స్‌తో అలాంటి భ‌య‌మేమీ ఉండ‌దు. మాట కూడా స్ప‌ష్టంగా వ‌స్తుంది.

Dental Implant:శాశ్వతంగా ఉంటాయా?

క‌ట్టుడుప‌ళ్లును త‌ర‌చూ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ Implant శ‌రీరంలో ఒక భాగంలా మారిపోతాయి కాబ‌ట్టి చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. ఇవి స‌హ‌జ‌మైన దంతాల్లానే బ‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇష్ట‌మైన ప‌దార్థాల‌ను హాయిగా తినొచ్చు. ఎలాంటి నొప్పి ఉండ‌దు.

డెంటల్ ఇంప్లాంట్స్ సహజ పళ్లలా షేప్, కలర్, ఫీల్ ఇస్తాయి. ఒకసారి ఫిక్స్ అయితే నిజమైన పళ్ళులా తేడా తెలిసే అవకాశం తక్కువ. తద్వారా చుయ్యింగ్, పట్టడం, మాట్లాడడం వంటి పనులు సహజంగానే ఉంటాయి.

ప్లేట్‌లు లేదా బ్రిడ్జ్‌లా ప్రతి కొన్ని సంవత్సరాలకు మార్చాల్సిన అవసరం ఉండదు. సరైన సంరక్షణతో డెంటల్ ఇంప్లాంట్స్ 15–20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువకాలం పనిచేస్తాయి.

దంతాలు కదిలించాల్సిన అవసరం లేదా?

ఎలాంటి సంకోచం లేకుండా ఉండొచ్చు. ఇది ఆత్మ‌విశ్వాసం పెర‌గ‌టానికి తోడ్ప‌డుతుంది. ఇంప్లాంట్స్‌ను అమ‌ర్చేందుకు ప‌క్క‌దంతాల ప‌రిమాణాన్ని త‌గ్గించ‌డం, క‌దిలించాల్సిన అవ‌స‌ర‌ ముండ‌దు. దీర్థ‌కాలం దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి తోడ్ప‌తాయి.

బ్ర‌ష్ brush, చేసుకునేటప్పుడు ఇంప్లాంట్స్ మ‌ధ్య‌లో కూడా తోముకోవ‌చ్చు. ఫ‌లితంగా నోటి శుభ్ర‌త మెరుగు ప‌డుతుంది. ఇవి చాలా ఏళ్ళ పాటు ఉంటాయి. జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటే జీవితాంతం ఉంటాయి కూడా.

Dental implantation, dental care tips in Telugu

డెంటల్ ఇంప్లాంట్స్ సహజ పళ్లలా షేప్, కలర్, ఫీల్ ఇస్తాయి. ఒకసారి ఫిక్స్ అయితే నిజమైన పళ్ళులా తేడా తెలిసే అవకాశం తక్కువ. తద్వారా చుయ్యింగ్, పట్టడం, మాట్లాడడం వంటి పనులు సహజంగానే ఉంటాయి. ప్లేట్‌లు లేదా బ్రిడ్జ్‌లా ప్రతి కొన్ని సంవత్సరాలకు మార్చాల్సిన అవసరం ఉండదు. సరైన సంరక్షణతో డెంటల్ ఇంప్లాంట్స్ 15–20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువకాలం పనిచేస్తాయి.

బ్రిడ్జ్ పెట్టేటప్పుడు పక్క పళ్ళను కట్ చేసి సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఇంప్లాంట్స్‌లో అలాంటిది లేదు. ఇంప్లాంట్ ఒక సింగిల్ టూత్ రీప్లేస్‌మెంట్‌గా పనిచేస్తుంది, మిగతా పళ్లు అలాగే హెల్తీగా ఉంటాయి.

పళ్ళు లేకపోతే జా బోన్ నెమ్మదిగా కరిగిపోతుంది. డెంటల్ ఇంప్లాంట్స్ ఎముకలో వేసినందున, బోన్‌ను స్టిమ్యులేట్ చేస్తాయి. ఎముక కరిగిపోవడాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల ముఖాకృతి మారకుండా ఉంటుంది.

ముఖాకృతి ఏమైనా మారుతుందా!

డెంటల్ ఇంప్లాంట్స్ (Dental Implant) బలంగా ఫిక్స్ అవుతాయి.ప్లేట్‌ల లాగా స్లిప్ అవు కావు, కదలవు. దాంతో మీరు గట్టిగా ఉన్న ఆహారాలు కూడా సులభంగా నమలవచ్చు.సాధారణ పళ్ళను ఎలా క్లీన్ చేస్తామో అదే విధంగా బ్రషింగ్, ఫ్లోసింగ్ చేస్తే చాలు.

అదనపు స్పెషల్ కేర్ అవసరం లేదు.డెంటల్ ప్లేట్లు వాడే వాళ్ళకి సాధారణంగా మాట్లాడేటప్పుడు స్లిప్ అయ్యే సమస్యలు ఉంటాయి. ఇంప్లాంట్స్ ఫిక్స్ అయ్యి ఉండటంతో ఈ లోపాలు ఉండవు. మీ మాట వినేవారికి పూర్తిగా నేచురల్ సౌండ్ వస్తుంది.

1 thought on “Dental Implant: డెంటల్ ఇంప్లాంట్ కు డౌట్ ఎందుకు?”

Leave a Comment