Ragi Patra: రాగి పాత్ర నీటి శాస్త్రీయ ప్రయోజనాలు

Ragi Patra: ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం అలవాటు. కాపర్ (రాగి) పాత్రల్లో నీళ్లు లేదా ఆహరం తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రలోని పోషక గుణాలు ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహా యపడతాయి.

రాగి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు!

రాగి పాత్రల్లో ఆహరం, నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడతాయి. వీటిలోని నీళ్లు తాగడం ద్వారా రక్తపోటు, థైరాయిడ్, రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది. ఈ పాత్రల్లోని గుణాలు నీటిలోని హానికరమైన క్రిములను తొలగిస్తాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాదు పొట్టలో పుండ్లు, అజీర్ణం కడుపు ఇన్ఫెక్షన్లకు రాగి అద్భుతమైన ఔషధం.

Ragi Patra: రాగినీరుతో ఊబకాయానికి స్వస్తి!

అధిక బరువుతో బాధపడుతున్న వారు రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు తాగడం ఉత్తమం. కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. అంతే కాదు రాగిలోని యాంటీ ఆక్షిడెంట్ లక్షణాలు క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడతాయి. ప్రతి రోజూ రాగి పాత్ర(Copper vessel)లో నీటిని తాగడం ద్వారా ఒత్తిడి, అలసట తగ్గుతుంది. చర్మం పై ముడతలను తొలగించి వయసు కనిపించనివ్వకుండా చేస్తుంది.

కాపర్ థైరాయిడ్ గ్లాండ్ అసమానతలను బ్యాలెన్స్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రాగి నీటి (Ragi Patra)ని తాగడం వల్ల ఎముకలు ధృడంగా అవుతాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారు రాగి పాత్రలో నీళ్లు తాగితే చాలా మంచిది. రాగి హీమోగ్లోబిన్ తయారీకి కావాల్సిన ఇనుము శోషణకు సహాయపడుతుంది.థైరాయిడ్‌తో పాటు, జాయింట్ పెయిన్స్ నివార‌ణ‌కు రాగిపాత్ర‌లో నీరు మేలు చేస్తాయి. ర‌క్త‌పోటును, హార్ట్‌రేటును నియంత్రిస్తుంది. రాగిపాత్ర‌లో నీరు తాగ‌డం వ‌ల్ల ఎటువంటి క్యాన్స‌ర్ అయినా ఆదిలోనే త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది.

రాగిపాత్ర‌లో నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీర గాయాలు త‌గ్గ‌డంతో పాటు అనేక జ‌బ్బులు న‌యం అవుతాయి. వాటిని త‌ట్టుకునేందుకు కావాల్సిన రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది కాబ‌ట్టి రాగి చెంబులో నీరు తాగ‌డం వ‌ల్ల వారికి ఇన్‌ఫ్పెక్ష‌న్లు రాకుండా నివారించ‌గ‌లుగుతుంది. అంతే కాకుండా వ‌య‌సు మీద బ‌డిన‌ట్టు క‌నిపించే వారికి రాగి నీళ్లు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా స‌హాయ‌ప‌డుతుంది.

ragi patra, copper glass

శ‌రీరంలో మెద‌డు చాలా ముఖ్యమైన అవ‌య‌వం. మెద‌డు నుంచి వివిధ శ‌రీర భాగాల‌కు న్యూరాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యూరాన్ల‌ను మైలిన్ అనే తొడుగు కాపాడుతుంది. రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్ తొడుకు ఈ మైలిన్ తొడుగుకు ర‌క్ష‌ణ‌గా ప‌నిచేస్తుంది. అందుక‌నే రాగిచెంబులో నీరు సేవ‌నం మెద‌డు చురుకుద‌నం, ప‌నితీరుకు మంచిగా దోహ‌దం చేస్తుంది. అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం త‌గ్గ‌డానికి కూడా రాగిపాత్ర‌లో నీరు స‌హాయ‌ప‌డుతుంది. కిడ్నీ, లివ‌ర్ ప‌నితీరు చురుగ్గా జ‌రిగేందుకు దోహ‌ద ప‌డుతుంది. అల్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు కూడా రావు.

Leave a Comment